ఉమ్మడి కుటుంబం-మమతల కోవెల

ఉమ్మడి కుటుంబం-మమతల కోవెల

రచన::పిల్లి హజరత్తయ్య

పల్లవి: జగము మెచ్చు ఉమ్మడి కుటుంబంరా.!
జనము నచ్చు మమతల కోవెలరా.! /2/

చరణం:1
అమ్మ చేతి కమ్మని వంటలూ
అందరూ కలిసి భుజించే సహపంక్తులూ
అనుబంధాలు వెల్లి విరిసే హరివిల్లులూ
అందరినీ కట్టిపడేసే అనురాగపు లోగిళ్లులూ/జగము/
చరణం:2
ఆత్మీయతను అనురాగాల కలబోతే కుటుంబము
అలకలు కలతలు కలబోసినదే కాపురము
అద్భుతమైన సామాజిక వ్యవస్థకు మూలము
అవనికే ఆధార భూతమైన నిలయము /జగము/
చరణం:3
జగమెరిగిన పెద్దలు విలువల నేర్పును
జీవిత సమస్యలకు పరిష్కారం చూపును
మానవ విలువలను వికసింప జేయును
మహిలో నిను ఆదర్శంగా నిలుపును. /జగము/

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!