నా మావ మీసం

మావా నీ మీసం చూస్తే… మనసంతా మత్తెక్కుతుంది !!!

మావా నీ మీసంలో రోషం చూస్తే…నీకు కోపం తెప్పించాలని ఉంది !!!

మావా నీ మీసం చక్కదనం చూస్తే… నే చుక్కనై నీ మీసం పైనే ఉండాలనుంది !!!

మావా నీ మీసం అట్టా తిప్పుతూ ఉంటే … నా చూపులతో చిక్కడిపోతుంది !!!

మావా నీ మీసం కయ్యానికి పోతుంటే… మదమెక్కిన సింగంలా ఉంటుంది !!!

మావా నీ మీసం నా ఆడతనానికి సవాలు విసిరినపుడు … అలా వంకలు తిరుగుతూ వడి పడిపోతుంది !!!

మావా నీ మీసం అలిసిన నీ మొహంపైన నెలవంకలా కనిపిస్తుంది !!!

మావా నీ మీసం నా బుగ్గలకు ఎరుపు రంగు పూస్తాయి !!!

మావా నీ మీసం నా మెడవంపులో రాతలు రాస్తాయి !!!

మావా నీ మీసం నా ఎదపై తీయని రాగాలు తీస్తాయి !!!

మావా నీ మీసం నా దేహంపై పూలు పూయిస్తాయి !!!

సరస్వతి నిత్యా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!