స్త్రీ శక్తి

కలంతో సాహితీ ప్రభంజనం, గళంలో సప్తస్వర నాదాలు, వీణలో నయాగరా రవళులు, కుంచెలో ఎన్నో రంగుల మేళవింపు, వస్త్రాలపై ప్రకృతి చిత్రాలు ఆమె ప్రత్యేకత. వంటల్లో ఎన్నో రుచులు, గృహ అలంకరణలో విన్నూత్నసృష్టి, హస్తకళల్లో మేటి చిత్రాలు, వస్త్ర అలంకరణలో ఎన్నో రూపాలు, సాహిత్యం సంగీతంలో జూమ్ లో ఎన్నో కార్యక్రమాలు, శ్రీ త్యాగాజస్వామి ఆరాధన ఇతర రాష్ట్ర కార్యక్రమాలు, వీణ నాదం ద్వారా, “Zoom Queen” గా ఇలా ఎన్నోరకాల కార్య క్రమాలు ద్వారా ప్రత్యేక కృషి ఆమె సొంతము. సంగీత రంగంలో 359 పైగా కచేరీలు జిల్లా అంతా సప్త స్వర వీణా రవళిగా ఏడు వీణలతో కార్యక్రమం నిర్వహించి 12 కీర్తనలు, 9 పల్లవులు రాశారు. లలిత సంగీతంలో 56 పాటలు రాశారు. బాల్యం నుంచి ఆటల్లో పాటలు, మాటల్లో పద్యాలు అమ్మఒడి బడిగా నేర్పారు.

పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు వాస్తవ్యులైన “శ్రీమతి నారుమంచి వాణి ప్రభాకరి” వీణా వోకల్ ఆర్టిస్ట్, రైటర్ & ఫ్రీలాన్స్ జర్నలిస్టు, 5 వరల్డ్ రికార్డ్స్, 100 పైగా బిరుదులు, 5980 ఆర్టికల్స్ ప్రచురణ పొందాయి. 45 కధలు, 4 నవలలు రాసారు. తానా సంగీత జడ్జిమెంట్, భువన విజయం తానా భాగవత ప్రచార అంతర్జాతీయ సమితి మెంబర్, తెలుగు సాహితీ సమాఖ్య సికింద్రాబాద్ మెంబెర్, అయిన గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు మీకు ఓ చిన్న పరిచయం. చిన్న పరిచయం అని ఎందుకు అన్నాను అంటే, కొంత మంది గురించి చెప్పాలి అంటే మనకి రోజులు తరబడి సమయం కావాలి. సమయానుభావ సమస్య వల్ల చిన్న పరిచయం అన్నాను.

ప్రైమరీ స్కూల్లో పాటల పోటీ బహుమతులు, హైస్కూల్ 8 వ తరగతిలో భువన విజయము పాడి బెస్ట్ సింగర్ అవార్డ్, కాలేజ్ స్థాయిలో వివిధ సంగీత క్లాసికల్ , లైట్ క్లాసికల్ , ఫోక్ లలో బహుమతులు, జాతీయ గ్రంథాలయ మండల, జిల్లా, రాష్ట్ర, అఖిల భారత స్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా అహ్వా నింపబడి సన్మానాలు బిరుదులు పొందారు. లైన్స్ తణుకు, స్వర్ణ లైన్స్ ఉమెన్స్ క్లబ్ ద్వారా జాతీయ గీతాలు 5 పాటలు 16 స్కూల్స్ టీచర్స్ కి ప్రతిభ వంతు లైన విద్యార్థులకు మూడురోజుల వర్క్ షాప్ నిర్వహించారు. ఆసక్తి గల వారికి ఆదివారం ప్రత్యేక శిక్షణ 5 వారాలు నేర్పారు. 364 పైగా వివిధ సంస్థలకు న్యాయ నిర్ణేతగా ఆహ్వానింపబడ్డారు.

2000 సంవత్సరంలో ఏడుగురు కళాకారిణిలతో కలిపి మిలీనియం ముస్కే గా ఒక్ రికార్డ్ సృష్టించి “సప్తస్వర వీణరవళి” గా, రాష్ట్ర మనోరంజని నుంచి “వీణరవళి” గా, ఇంటర్ నేషనల్ లైన్స్ నుంచి గాన కోకిల గాత్రానికి నాదామృత సుగాత్రి” గా, తానా వారి నారీ సాహిత్యభేరి లో “ఆధునిక కవితా వాగ్గేయకారిణి” గా ఇలా విభిన్న సంస్థల ద్వారా 100 కు పైగా బిరుదులు పొందారు. మ్యూజిక్ థెరఫీ డిస్ట్రిక్ట్ చైర్మన్ గా రెండు ఏళ్లు 350 క్లబ్ లకు పత్రాలు అందించి సంగీతం పై అవగాహన కల్పించారు.

లలిత కళాతోరణం తెలుగు విశ్వ విద్యాలయం వారి ఆధ్వర్యంలో 5 సం.ల పాటు 40 రోజుల వేసవి శిక్షణ శిబిరం ద్వారా రెండు వేల మందికి 5 సం.ల వయసు వారి మొదలు 75 ఏళ్ల వయసు వారి వరకు సంగీత క్లాసులు నిర్వహించి సర్టిఫికేట్ లు అందించారు. ఈ కార్యక్రమం శ్రీ చిత్తూరు ఇందృత్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ద్వారా శ్రీ విజయ శంకర సంగీత నాట్య ప్రభుత్వ కళాశాల వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిపై పంచరాగ రత్న కీర్తనలు రాసి ఆలపించి ఆయనకు బాడంపూడి శ్రీ బాల సుబ్రహ్మణ్యం , శ్రీ కార్యసిద్ధి వినాయక శ్రీ దత్త స్వామి క్షేత్రంలో అందచేశారు.

హిందోళ రాగంలో గీతం లేదు అంటే విలక్షణ గీతం రాసి పిల్లలకు నేర్పారు. 12 కృతులు రాశారు. లలిత సంగీత గేయాలు 100 కు పైగా రాశారు. ఆమె రాసే ప్రతి కవిత వరుస కట్టి లలిత గేయాలు గా పాడటం ఆమె ప్రత్యేకత. 4వ ప్రపంచ మహాసభలలో కవితను గేయ రూపం లో పాడి సభా ప్రశంస పొందారు. 320 పైగా కచేరీలు చేశారు. భాగవత ప్రచార సంస్థ సింగపూర్ వారి ఆధ్వర్యములో శ్రీ అన్నమయ్య సప్తగిరి సంకీర్తన సంగీత సభలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి శత గళార్చనలో పాల్గొన్నారు. ప్రముఖ సంగీత కళాకారులు సంగీత విద్వాంసులు అయిన శ్రీమతి డాక్టర్ శోభారాజు గారు వచ్చి తణుకు సభలో శ్రీ అన్నమయ్య కీర్తనలు చిన్న తిరుపతి లో ఆలపించినందుకు గాను లైన్స్ స్వర్ణ తణుకు తరఫున సన్మాన పత్రం అందించారు.

బేబీ గాయత్రి , వీణ, అనురాధ సురేష్ కృష్ణ మూర్తి సహన ఫేమ్ టీవీ రేడియో ఆర్టిస్ట్ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి శిష్యురాలు ప్రత్యేక సలహాలు సూచనలు పొందారు. వీరిని ప్రముఖ మహిళా పత్రిక కలువ బాల, వనితా జ్యోతి, ఆంధ్ర భూమి మహిళా విభాగం ద్వారా ఇంటర్వ్యు చేయడమే గాక సన్మాన పత్రాలు అందజేశారు. ఐదు సార్లు జాతీయ స్థాయి అవార్డ్ గ్రహీత దక్షిణ భారత లతా మంగేష్కర్ గా పిలువబడిన ప్రముఖ సినీ గాయని శ్రీమతి పి.సుశీల గారితో కలువ బాల వార్తా పత్రిక లో ఇష్టా గోష్టి నిర్వహించారు.

సరాలయ సిస్టర్స్ డాక్టర్ శోభ నాయుడు శ్రీ ఈమని కళ్యాణి గారు ఇత్యాది మరియు సంగీత గురువులు శ్రీ చల్ల సుబ్రహ్మణ్యం గారి వద్ద వీణ 6 సం.లు నేర్చుకున్నారు. ఈయన శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి గురుకుల విద్య శిష్యులు . పద్మశ్రీ డాక్టర్ శ్రీ అయ్యగారి శ్యామ సుందర్ ఆర్టీడీ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు వారి సతీమణి శ్రీ అయ్యగారి జయలక్ష్మి గార్ల వద్ద ప్రత్యేక విద్య శిక్షణ పొంది పరీక్షలు రాశారు. విభిన్న కార్యక్రమాలు రేడియో, టీవీ ద్వారా పాల్గొన్నారు.

ఇంటర్ కాలేజి రాష్ట్ర స్థాయి పోటీలకు జాతీయ స్థాయి పోటీల నిర్వహణలో విద్యార్థులకు సలహాలు సూచనలు అందిస్తారు. ముఖ్యంగా సంగీతాన్ని అతి తేలికగా తక్కువ కాలంలో నేర్చుకునే విధానం ద్వారా ప్రత్యేక శ్రద్ధతో కోర్సులు నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రముఖ రంగం ఉన్నత స్థాయి ఉద్యోగులు తగిన సూచనలు సలహాలు పొంది విద్యను నేర్చుకుంటున్నారు. ఇలా ఎన్నో సంగీత అంశాలపై పత్ర సమర్పణలు కూడా చేశారు. జానపదం గురించి ప్రత్యేక శ్రద్ధతో పత్రాలు అందించారు. నిత్య జీవితంలో సంగీత రవళి అంశములు విశాఖ సంస్కృతి మాస పత్రిక ద్వారా సీరియల్ గా అందిస్తున్నారు.

ఉగాది పురస్కారం స్వయం సిద్ధ, వీణ లో సరస్ భారతి ఉయ్యూరు శ్రీ గబ్బిట దుర్గ ప్రసాద్ గారు అందించారు. మరెన్నో సంగీత రవళి అంశాలు కలం ద్వారా గళం ద్వారా వీణ ద్వారా అందించే కృషి నిరంతరము సంగీతమే నిరంతరం శ్వాసగా ధ్యాసగా కృషి చేస్తున్నారు.

ఏ రంగంలో ఎదగాలన్న తగిన కృషి మంచి గురువు కావాలి, ఇంట్లో వారి ప్రోత్సాహం కావాలి, సాధన చెయ్యాలి, ప్రముఖుల ఆశీస్సులు తోడైతే ఆ వ్యక్తి మంచి కళాకారులుగా రాణిస్తారు”  అని చెప్పే “శ్రీమతి నారుమంచి వాణి ప్రభాకరి”  గురించి మహిళా దినోత్సవం సందర్భంగా అందరితో పంచుకోవటానికి మేము ధన్యులము..

మహిళా ఓ మహిళా విశ్వ కీర్తి జనిత

మనసు మమత మానవతా

అంతా నీకే సొంతమని అనంతమని

సాటి లేని కీర్తి జగతికి పంచిన మహిళా

తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా అంతా నీకే సొంతమని

విశ్వ శాంతి నేతగా ఎదిగిన మహిళా

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళ

సహనం శాంతం సౌశీల్యం

పుణ్య భూమిలో పంచాలని

అష్ట లక్ష్మిగా శాంతి దూతగా

జగతికి పెంచిన మహిళా ఓ మహిళా

“అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంచిక” కు అభినందనలు తెలుపుతూ మహిళలకు అంకితము. పుస్తక ప్రచురణ కర్తలకు, రచయిత్రులు అందరికీ అభినందనలు.

You May Also Like

One thought on “స్త్రీ శక్తి

  1. టైటిల్ కి న్యాయం చేసారు
    ఒక మహోన్నత వ్యక్తి పరిచయం కలగడం మా అదృష్టం 🙏🏼

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!