మడత పూరి

మడత పూరి

రచన :: నారుమంచి వాణి ప్రభాకరి

మడత పూరి తయారీ కి కావలసిన పదార్థాలు ::

మైదా             –   1/4 కిలో

ఉప్పు             –   చిటికెడు

పంచదార        –   1 కప్పు

నెయ్యి             –   1/2 కప్పు

బియ్యం పిండి   –   1/4 కప్పు

తయారీ విధానము::

  • ముందుగా మైదాకు ఉప్పు రెండు చెంచాల నెయ్యి వేసి చపాతీపిండిలా కలిపి రెండు భాగాలుగా విడి విడిగా చేసుకోవాలి
  • మిగిలిన నెయ్యిలో బియ్యం పిండి కలిపి క్రీమ్ లాగా చేసి ఉంచుకోవాలి
  • పెద్దగా పూరి వత్తి దానిపై ఈ క్రీమ్ రాసి చుట్టలా చుట్టుకొని, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఒక్కొక్క ముక్కను పురిగా వత్తుకోవాలి..
  • ఓవెన్ ఉంటే అందులో ప్లేట్ లో పెట్టి ఓవెన్ లో పెట్టాలి .(లేదా)
  • బాండీలో ఓ పావు కిలో నూనె కాచి అందులో వేయించి పక్కన పెట్టాలి .
  • ఇప్పుడు పంచదార పాకం పట్టి అందులో ఈ పూరి వేసి తీసి పక్కన పెట్టాలి.
  • ఎంతో సులభంగా చేసుకునే రుచికరమైన మడతపూరి రెడీ..
  • మరి ఇంక ఆలస్యం ఎందుకు మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు…

 

You May Also Like

One thought on “మడత పూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!