మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: స్వరూపరాణి గజ్జల

ఇంటింటా మొక్కలను పెంచు
ప్రాణవాయువు నిచ్చు చెట్టు
కాలుష్యం నివారించును చూడు
చూడచక్కని తెలుగు సున్నితంబు

చెట్టుతో చెలిమిచేసి చూడు
పురిటిబిడ్డకు ఊయలై ఊపేను
వృద్ధాప్యంలో చేతికర్రై ఊతమిచ్చు
చూడచక్కని తెలుగు సున్నితంబు

రహదారులకు ఇరువైపుల తరువులు
బాటసారులకు సేద తీర్చును
పచ్చని చెట్లు ప్రకృతికందం
చూడచక్కని తెలుగు సున్నితంబు

పుడమి గర్భంతో మొక్కకు
చెంబుడు నీళ్ళు పోస్తే
మంచి ఫలాలను అందించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఔషధాలు ఇచ్చును తరువులు
అడవి సంపదని పెంచుకుందాం
పర్యావరణాన్ని రక్షించుకుందాం నేడు
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!