మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: మండలోజు. నర్సింహస్వామి

తరువులే నరులకు హాయినిచ్చు
ప్రకృతికి తరువులే శోభనిచ్చు
తరువుల్లేకయు నరులు లేరు
చూడచక్కని తెలుగు సున్నితంబు

వాయువే జీవాలకు ప్రాణదాతవు
తరువులే వాయువుకు మూలాధారం
చెట్లతో చెలిమి సేదదీర్చు
చూడచక్కని తెలుగు సున్నితంబు

జీవకోటికి ఫలాలతో ఆకలిదీర్చు
అందమైనట్టి పూలతో శోభనిస్తూ
మనస్సుకు హాయినిచ్చె పిల్లవాయువులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

తరువులను నరికినను కర్వోచ్చును
దేశసంపదలో తమవంతు పాత్రను
పోషించుచూ కల్పతరువులా నిల్చెవు
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఓషధులతో నరులకు ప్రాణదాతవోలె
పాలకడలి నుండి పైకొచ్చినావు
సృష్టిలో చిరంజీవిగా నిల్చినావు
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!