పరవశమే

పరవశమే

రచన ::పిల్లి.హజరత్తయ్య

నీవునేను ఎల్లప్పుడు పక్కనుంటె పరవశమే..!
సువాసనల పరిమళాలు చల్లుతుంటె పరవశమే..!

నీరాకను చూడగానె గిలిగింతలు మనసులోన..
కదిలించే రాగమేదొ పలుకుతుంటె పరవశమే..!

నీకోసం ఎదురుచూసి మనసులోనె మదనపడ్డ..
కలల్లోని ఆరూపం చెంతనుంటె పరవశమే..!

నీపలుకులె నాశ్వాసగ వికసించిన పూలులాగ..
చల్లనైన కబుర్లెన్నొ సాగుతుంటె పరవశమే..!

మనమాడిన ఊసులన్ని ఎదలోతున దాచుకున్న..
జీవితంలొ ఎప్పటికీ మరవకుంటె పరవశమే..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!