జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు

జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు

రచన :: పిల్లి.హజరత్తయ్య

సాగర సంపదకు ఆవాసాలు
ప్రాణవాయువు నివాసాలు
జీవరాశికి జీవనాధారాలు
జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు
మన మహాసముద్రాలు..!

వైద్య పరమైన ఔషధాలు
విలువైన ముత్యాలు, ఖనిజాలు
ఖరీదైన గ్యాస్ పదార్ధాలు
ముడిచమురు ఉత్పత్తులు
అందించు మన సముద్రాలు..!

సముద్ర ఆహార పదార్థాలు
పక్షుల విడిది కేంద్రాలు
అందమైన విహార స్థలాలు
వాతావరణ వాహకాలు
మన సముద్రాలు ..!

మత్స్య పరిశ్రమ కేంద్రాలు
జల రవాణా సాధనాలు
వర్షానికి ఆధార భూతాలు
జల సంరక్షణ ప్రదాతలు
మన సముద్రాలు..!

సాంకేతిక ఉత్పత్తుల విశేషాలు
నౌకా కాలుష్యాలు
మైనింగ్ వ్యర్థపదార్థాలు
ప్లాస్టిక్ వ్యర్థాలు
సముద్ర కాలుష్య కారకాలు..!

భూతాపం తగ్గించి
సమతుల్యతను రక్షించి
వేలాదిమందికి ఉపాధినిచ్చే
సముద్రజలాలనురక్షించుకోవాలి
పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!