కరోనా
అంతం లేని కరోనా !
ప్రపంచం అంతు చూస్తున్న కరోనా!
పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా కబళిస్తున్న కరోనా!
నాకేంటి అనే వారి గర్వాన్ని కూడా అణచి వేస్తున్న కరోనా!
అతిధి గా వచ్చి తిష్ట వేసి అధికారం చెలాయిస్తున్న కరోనా!
తప్పు ఏ మాత్రం నీది కాదు కరోనా!
మా నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని
మా తోనే ఉంటున్నావు కరోనా !
ప్రాణాలను గాలిలో కలిపి వేస్తున్నా
ఆవగింజంత తెలివి లేకపాయే కరోనా !
జనానికి ఎంత చెప్పినా వినరు
ఎందుకంటే చెవులు మందం కరోనా!
గుంపులు గుంపులుగా తిరగడం
మానరు కరోనా!
మ్రృత్యువు ముంగిట ఉన్నా
మాస్కు ధరించడం లేదు కరోనా!
నీ వల్ల కొన్ని చీకటి శక్తులకు
కళ్ళెం పడుతుంది కరోనా!
అరువు తెచ్చుకున్న వాడు
అరిగించుకుంటున్నాడు కరోనా!
చీకటి బంధాలకు కళ్ళెం
వేసశావు కరోనా !
కష్ట జీవులు నలిగిపోతున్నారు
కరోనా !
వ్యాక్సిన్ తో నీ బాధ తప్పింది
అనుకున్నారు అంతా కరోనా!
మళ్ళీ నీ రూపు,రూటు మార్చుకుని
వచ్చావు కరోనా!
ఎంతైనా మా జాగ్రత్తలో మేము
ఉండడం మంచిది కరోనా!
జాగ్రత్తగా ఉండకపోతే రోనా,రోనా
తప్ప ఏమీ మిగలదు కరోనా!
రచన :: యం.సుశీల రమేష్.
