కూటి కోసం
క్షణం తీరిక లేక, కంటికి నిద్రలేక
నిర్విరామ శ్రమతో , సమయాన్ని చూడక
జానెడు పొట్ట కూటి కోసం
నిత్యం పరితపిస్తూ , అనునిత్యం శ్రమిస్తూ
నలిగి పోతున్న జీవితంలో, వెలుగు ఎక్కడ
ఎటు చూసినా ఏమున్నది?
నలు దిక్కులా నాట్య విహారంలా
అన్యాయాలు ,అక్రమాలు, దోపిడీలు
అన్నీ దుర్మార్గుల ఆధీనంలో
నాది అన్న వాడికి ఇంకేం లేదు అంటూ…
దౌర్జన్యంతో,పీడనంతో, అన్యాయంగా
సర్వం స్వాధీనం చేసుకుంటూ .
మాటల పిడిబాకులతో హృదయాన్ని
తూట్లు తూట్లులా పొడుస్తూ
గుండెని గాయపరుస్తూ
పారని రక్తపుటేరులను తలపిస్తూ…
క్షణం క్షణం చావలేక చస్తూ బతకలేక జీవిస్తూ
బతుకుతున్న మొండి మనుషులం..
కూటి కోసం కోటి విద్యలు..
ఎన్ని చేసిన ఐదు వేళ్ళు నోటిదాకా చేరవు..
బ్రతుకు బండిని లాగలేక నిత్యం ఓడిపోతున్న మనుషులం కూడులేని నిర్భాగ్యులం
కూటికోసం ఈ జీవిత పయనంలో
అలుపెరుగని కూలీలం…….
రచన ::మధుమాసవీణ (జె.స్వయం ప్రభ)