గురుపూర్ణిమ (పద్యం)
— గుడిపూడి రాధికారాణి
సీ//
తొలిగురువుకెపుడూ తొలుత వందనమిమ్ము
వ్యాస పూర్ణిమ నాడు ధ్యాస నిల్పి
మదిన భయము ద్రుంచి మమతలు గురిపించు
ఆది గురువు గాన అమ్మ రక్ష
వెలుగుదారిని జూపి వెన్నంటి నడిపించి
నాన్న మిత్రుని వలె నన్ను దీర్చు
నీతి తప్పొద్దని నియమాలు బోధించి
గురుకోణమును జూపి గురువు వెలుగు
ఆ//వె//
ప్రగతి మెట్ల పైన పసిడి పథమ్మున
ధీటుగాను నడుచు దీవెనొసగు
గురువు సతతమున్ను గుడిలోన దైవమే
గుండె గుడిగ జేసి గొల్వుమోయి
***