మా నాన్న అనుభవాలు

మా నాన్న అనుభవాలు

-సుజాత

మనం పయనించే జీవన పోరాటంలో
ఎన్నో ఒడిదుడుకుల ప్రయాణం చేశాం
అదే రజాకార్ల సమయాన ప్రాణాలను

గుప్పిట్లో పెట్టుకొని జీవనమరణాలతో

అలుపెరుగని పోరాటం చేసి మన రక్తంలో

నిండిన భారతీయ సంస్కృతి కాపాడాలనెే

పోరాటం చేసి మన స్వేచ్ఛ వాయువులకు

ఆటంకం కలగకూడదనే ఎంతగానో

పోరాటం చేశాం విలువైన జీవితాలను కోల్పోయాం

అయినా మన లక్ష్య సాధనకై ఎంతదూరమైనా వెళ్లెేదని

తిండీ నిద్రలు మాని స్వాతంత్య్రం తెచ్చుకోవడానికి

ఎంతగానో పోరాడాము

గాంధీ గారితో కలిసి చేసిన సేవలు

గాంధీ గారితో నడిచిన ఆ అనుభవాలు

మన కళ్ళెదుటే సాక్షాత్కరిస్తున్నాయి.

అదే స్వాతంత్య్రం వచ్చిన 15 ఆగస్టు ఆ రోజున

మా ఆనందాలకు అవదులు లేవు

గడిచిన గతాన్ని నెమరువేసుకుంటూ

అక్షరాలతోనైనా ఒడసి పడుదామని

తిరిగెేస్తున్న మీ పేజీల్లో మా జ్ఞాపకాల దొంతరలు

నిలిచి ఉండాలనే ఆవేదన బాబు అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!