మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: వలిపే సత్యనీలిమ

అవని అంత హాయినిండగా
ఆకుపచ్చ తోటగా మారగా
భూమితల్లి మనసు మురిసెగా
చూడచక్కని తెలుగు సున్నితంబు

అందరూ మొక్కలు నాటాలిగా
మొక్కలే వృక్షాలై నీడనిచ్చుగా
స్వచ్ఛమైన గాలినే పీల్చాలిగా
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఓజోన్ పొరనే రక్షించగా
సూర్యకిరణ తాకిడి నివారించగా
వేసవైన చల్లగా మార్చాలిగా
చూడచక్కని తెలుగు సున్నితంబు

సకాలంలో వర్షాలే కురుస్తాయిగా
రైతుల కష్టాలన్నీ తీరుతాయిగా
హరితవన కార్యక్రమం ఫలియించగా
చూడచక్కని తెలుగు సున్నితంబు

కాలుష్యం ఎటో పారిపోయెగా
రోగాలు,జబ్బులు రానేరావుగా
ప్రతిఇంట్లో సంతోషం నిండాలిగా
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!