మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: యాళ్ళ ఉమామహేశ్వరి

చెట్టు ప్రాణం నిలబెట్టును
స్వచ్ఛమైన గాలి పంచును
జీవితాన్ని ఉన్నతంగా నిలుపును
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఎన్నో విషయాలు తెలుపును
మంచి నడవడిక నేర్పును
మనసుకి ఆహ్లాదం పంచును
చూడచక్కని తెలుగు సున్నితంబు

పరోపకారమును మనకు నేర్పును
మన అవసరాలు తీర్చును
ఆమూలాగ్రం అక్కరకొచ్చి ఉపయోహగపడును
చూడచక్కని తెలుగు సున్నితంబు

పండ్లకోసం బాధించినా మన్నించును
అవసరాలకని నరికినా భరించును
ఫలితమేమి ఆశించకనే అక్కరకొచ్చును
చూడచక్కని తెలుగు సున్నితంబు

పచ్చదనం పెంచు నిస్వార్ధంతో
పుడమికి ఆనందమువ్వు సంతోషంతో
భవిష్యత్తరాలకి ఆరోగ్యమివ్వు భాధ్యతతో
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!