మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: బిచ్చాల సౌందర్య

పచ్చనిచెట్లు ప్రకృతికి అందం
పచ్చనిచెట్లు ప్రగతికి మెట్లు
పచ్చనిచెట్లు పరోపకాం చేయు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్కలను నాటి పెంచిపోషించు
శుభకార్యంలకు బహుమతి ఇవ్వు
ప్రతిపుట్టినరోజు ఒకమొక్కను నాటు
చూడచక్కని తెలుగు సున్నితంబు

భువిపై విత్తనాలు చల్లిన
విరివిగాఫలించి అభివృద్దిజెందు
అందరికి అధికసిరులు పండించు
చూడచక్కని తెలుగు సున్నింబు

వనాలను కాపాడడం మనకర్తవ్యం
పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి
ఆరోగ్యప్రధాతలై అందరిని రక్షించును
చూడచక్కని తెలుగు సున్నితంబు

తరువులే జీవులకు ప్రాణవాయువునిచ్చు
తరువులే జీవామృత ఫలంబులనిచ్చు
తరువులే నిలువ నీడనిచ్చు
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!