అన్నా- చెల్లెలు

అన్నా- చెల్లెలు

రచన::పిల్లి.హజరత్తయ్య

Pilli hajaratthayyaసూక్ష్మ కావ్య స్ఫూర్తి
(Feel Good Poetry)

1.చిన్ననాటి చెలిమి నీవు
చిరు అనురాగపు ప్రతీకను నేను

2. సమత మమతల మైత్రివి నీవు
మదిలో మెదిలే చెరగని నవ్వును నేను

3. అనుబంధానికి చిహ్నము నీవు
ఆప్యాయతకు నిదర్శనము నేను

4. నేనున్నానని భరోసా ఇచ్చేది నీవు
తరువుల లతయై అల్లుకునేది నేను

5. పరువు నిలిపే పౌరుషం నీవు
పద్ధతిగా నడుచుకునే పరువం నేను

6. కుటుంబ విలువలకు పునాది నీవు
వాత్సల్య పరిమళాలను వెదజల్లేది నేను

7. ప్రేమను పంచే ప్రతిరూపం నీవు
రక్తసంబంధం వెలిగించే దివ్వెను నేను

8. నాలో ఆత్మవిశ్వాసాని నింపేది నీవు
పుట్టింటి ఆత్మగౌరవం నిలిపేది నేను

9. పుట్టింటి సారెలు తెచ్చేది నీవు
పసుపు,కుంకుమ స్వీకరించేది నేను

10. నా కోసం వేచిచూసేది నీవు
నీ రాకకై ఎదురు చూసేది నేను

11. నాకు నీవు రక్ష
నేను నీకు రక్ష

12. మనం దేశానికి రక్ష
దేశమే మనకు రక్ష

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!