మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచన :: సి.హెచ్. రజిత

ప్రకృతమ్మకు రూపము నివ్వు
పచ్చని వనాన్ని పెంచవోయి
ప్రగతికే అది మార్గమోయ్
చూడ చక్కని తెలుగు సున్నితంబు

ఆశల మొక్కవై చిగురించు
ఆమని మేను పులకించు
వసంతమై భవిత నిర్మించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొలకెత్తు విత్తువై తపించు
అవనికే నీవు ఆదర్శమవ్వు
చక్కగ మొక్కల నాదరించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

పర్యావరణ పరిరక్షణ చేయు
స్వచ్ఛతకు అదియే తార్కాణం
సకల జీవులనదే సంరక్షించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్క పెంచిన మోదము
పుడమికే మరి సోయగము
భవిత కివ్వు బహుమానము
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!