మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచన :: యామిని కొళ్లూరు

ప్రకృతి మనందరి సంపద
మన తొలి నేస్తం  ప్రకృతి
మానవ మనుగడకి జీవనాధారం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

ఆహరం ఔషధమిచ్ఛే వృక్షాలు
పక్షుల స్థావరం పచ్చనిచెట్లు
అలసినవేళ  సేదతీర్చే  వృక్షం
చూడచక్కని తెలుగు సున్నితంబు

. పర్యావరణ కాలుష్యం నివారిద్దాం
పర్యావరణ ఆవశ్యకత వివరిద్దాం
పుడమి తల్లిని కాపాడుకుందాం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

.ఇంటింటా మొక్కలు నాటుదాం
వృక్షాల నరికివేత అడ్డుకుందాం
విశ్వమంతా పచ్చదనం నింపుదాం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

ప్రకృతి వైపరీత్యాలు అరికడదాం
జన్మదినం  పెళ్ళిళ్ళు  వేడుకలకి
ప్రేమకానుక మొక్కను అందిద్దాం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!