గ్లోబల్ వార్మింగ్
రచన ::పిల్లి.హజరత్తయ్య
చల్లదనాన్ని పంచాల్సిన భూగోళం
మనిషి సృష్టిస్తున్న కాలుష్య విధ్వంసానికి
అగ్ని గోళమై మండుతున్నది..!
ప్రాణవాయువు నిచ్చే చెట్లునరికి
వ్యర్థాలతో పచ్చదనానికి పాతరేసి
కూర్చున్న చెట్టును నరుక్కుంటూ
భావితరాల భవిష్యత్తును బుగ్గిచేస్తున్నాడు..!
వృక్షాలు పెంచి, కాలుష్యాన్ని నివారించి
గ్లోబల్ వార్మింగ్ కు చరమగీతం పాడి
జీవరాశులకు ఆలవాలమైన భూగోళాన్ని కాపాడాలి..!
***