నా నీ మన లేఖ

నా నీ మన లేఖ

 

అనుకోనెలేదు ఏనాడు!

నిన్ను కలుస్తాను అని ….

 

కలలా నా జీవితంలోకి ప్రవేశించి!

నా కళలకు కాంతి అయ్యావు …

నా ఆనందానికి పునాది అయ్యావు …

 

ఎలా వచ్చావో తెలీదు కానీ ?

నా జీవిత మార్గం నువ్వు అయ్యావు !

 

ఏం అనుకోని వచ్చావో కానీ!

నాకంటూ అన్ని నువ్వే అయ్యావు…

 

ఎందుకు వచ్చావో తెలీదు కానీ!

నా ప్రేమగా మారిపోయావు ….

 

ఎలా చెప్పాలో? ఎలా వర్ణించాలో!

తెలీడం లేదు?

తేలడం లేదు !

నీపై నా ప్రేమని ….

 

మనసులోంచి వచ్చే భావాలని !

మాటలతో చెప్పలేక ?

చేతలతో చూపలేక ?

ఇలా కలాన్ని కదిలిస్తూ !

అక్షరరూపంలో !

నీ ముందు ఉంచుతున్న !

నా నీ మన లేఖ ….

                         రచన: యస్. లక్ష్మి

You May Also Like

One thought on “నా నీ మన లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!