నాన్నే నా ధైర్యం

నాన్నే నా ధైర్యం

నాన్న” పదంలో పిల్లతనం చూడగలం కాని,

అది బాధ్యతతో నిండి ఉంది
చిన్నతనంలో నాన్న అంటె భయం ఉండేది,
ఏది కావాలన్న అమ్మ ద్వారా నాన్నకు తెలిసేది
నాన్న ఎప్పుడు కసురుకోలేదు,
ఎప్పుడు మందలించలేదు, ఏది వద్దన లేదు.
అమ్మ దగ్గర ఎంత అల్లరి చేసిన అదేంటో తెలీదు
నాన్న దగ్గర మాత్రం భయం ఉండేది
చదువులో ఎదైనా అర్ధం కాలేదని ఏడిస్తే,
నాకు అర్ధమయ్యేలా నేర్పించేవారు.
పరీక్ష సమయంలో నాతో పాటుగా
తను కూడా కూర్చొని చదివే వారు.
కథలు,జోక్స్, తన చిన్ననాటి చిలిపి పనులు అన్ని మాకు చెప్పేవారు.
కాల క్రమేణా నాన్నలో ఉన్న చిన్న పిల్లాడితనం చూసి, నాన్న మీద భయం పోయింది.
పై చదువు చదవాలని, ఒక్కసారైనా విదేశాలకు వెళ్లాలనే  నా ఆశయం నాన్న తెలుసుకొని ప్రోత్సహించారు
ఎన్ని కష్టాలు ఎదురైనా, తన కష్టాలు
మాకు తెలియనివ్వకుండా
పిల్లల ఆశయాలను నెరవేర్చడానికి తోడ్పడేవారు
మేము వేసే ప్రతి అడుగులో తోడూ నీడలా ఉండి ముందడుగు వేయమని భుజం తట్టేవారు
నాన్న కుటుంబం కోసం పడే కష్టాలు చూసి,
మాలో బాధ్యతను పెంచింది.
నాన్న పట్ల గౌరవం పెరిగింది
అందరిని గౌరవించాలని,
ఎవరి మనసు నొప్పించరాదని,
నచ్చని సందర్భం ఎదురైతే చిరునవ్వుతో ఒదుగు కోవాలని,
దైవ నమ్మకం పెంచుకోవాలని,
కష్టపడి పని చేయాలని,
భాద్యతగా ఉండాలని..
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా,
ధైర్యంతో ఎదుర్కోవాలని,
పిరికితం పనికి రాదని నాన్న చూసి నేర్చుకున్నాను.
నిజమే, నాన్న చెప్పిన మాటలలొ ఎన్ని అర్ధలో ఉన్నాయో కాలక్రమేణా తెలుసుకున్నాను,
నాన్న ! మీ భావాలను ఎలా వ్యక్తపరచాలో మీకు తెలియదు. కానీ మాపట్ల మీకున్న ప్రేమ,ఆప్యాయతను గ్రహించ గలముు.
అదేంటో మీ గొంతు వింటే చాలు, ఎక్కడ లేని ధైర్యం, ఉత్సాహం వస్తుంది.
మీరు నేర్పిన జీవిత పాఠాలను గుర్తు పెట్టుకొని, ముందడుగు వేస్తాను
నేను వేసే ప్రతి అడుగు , మీకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటుందని ప్రమాణం చేస్తున్నాను.
నాన్న నువ్వే నాకు అండ, ధైర్యం, శ్రీ రామరక్ష

ఇట్లు మీ గౌరవం
శ్రీలక్ష్మి . బి

You May Also Like

3 thoughts on “నాన్నే నా ధైర్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!