సంస్కృతి

సంస్కృతి

రచన ::జాధవ్ ముకుంద్ రావు (కవిరత్న )

జీవన విధానంలో ముఖ్యమైన విషయం
సంస్కృతి అనేది మానవత్వము బోధం
సంస్కృతి అనగా జీవిత ఆచార వ్యవహారం
మతం సంబంధాలు పాలన వంటి సూచించే పదం !!

ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు
తరాలలో జరిగే మార్పులు మధ్య నమ్మకాలు
జీవిత వారసత్వంగా కొనసాగించే విధానాలు
సమాజంలో పాటించే భాష పద్ధతులు అభివాదాలు!!

ఒక సమాజం చేసిన వాడిన పరికరాలు
సంగీత కళ శిల్ప చిత్రం నిర్మించిన కట్టడాలు
జీవన విధానం ఆహారం నాటకం సినిమాలు
వినియోగము సంపన్నత జానపద వ్యవహారాలు !!

వస్తువులు అట్టి ఉత్పత్తి విధానం
వాటిని గమనించిన ఏకైక దృక్పథం
కనుక నైతికత కళలు విజ్ఞానం మార్గం
మన సంస్కృతేనని వీరి అభిప్రాయం !!

సహజీవనం విలువలు సాంప్రదాయం
విశ్వాసాలు సంస్కృతిలోని ముఖ్య భాగం
ప్రపంచ దేశాలలో మన సనాతన ధర్మం భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం !!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!