*కిటుకులు కైతికాలు*
మట్టిగాజులిచ్చిననూ
మురిసిపోయి తీరతారు
మల్లెపూలు తెచ్చిచూడు
సంబరమే చూపుతారు
వారెవ్వా భార్యలు
అల్పసంతోషులు
బుంగమూతి పెట్టినపుడు
బుజ్జగించితే చాలు
తను చేసిన వంటకాలు
మెచ్చుకుంటే చాలు
వారెవ్వా కిటుకులు
తెలుసుకోండి భర్తలు
తెస్తే తెచ్చావుగాని
అమ్మా! భలే కోడలే!
తనచెవిలో పడేలాగ
విసరండీ పొగడ్తలే
అప్పుడు మీ భార్యలు
తళుకుమనే తారలు
రోజుకొక్కసారైనా
మనసుతోటి మెచ్చిచూడు
చిన్న సాయమైనగాని
చిరునవ్వుతొ చేసిచూడు
బాబ్బాబూ! భర్తలు!!
నేర్చుకోండి బాబులు!!
రచన: గుడిపూడి రాధికారాణి