కడప రెడ్డెమ్మ

కడప రెడ్డెమ్మ

ఒరే ఈరప్ప ఎందిరా 

నువ్వు సెప్పేది నేను ఇనేది 

ఈ రోజు శుక్కురారం అయితే ఏంది రా 

మటన్ అంగడి పెట్టకపోతే ఏమి తినాలిరా..

 

అసలే టెంటులో కొత్త సినిమా ఏసినారు

నేను బిరీన బువ్వ వండి 

మేటని ఆటకి పోవాలనుకున్యా

ఇయ్యాల సంగటి మటన్ కూర తినాలనుకున్యా

 

మటన్ ఇస్తావా నీ తల నరకమన్నావా

సంగటి తలకాయకూర గూడా

బాగానే ఉంటాదిరే

ఈ కడప రెడ్డెమ్మ మాట అంటే మాటే..

 

ఎందప్పా ఎందమ్మి ఈడ బొమ్మలు గిమ్మలు  గాని అడుతున్నాయా ఏంది..

అట్లా మిడిగుడ్లేసుకొని సూత్తన్నారు

మీ తలలు ఏమన్నా ఇచ్చే ఆశ ఉందా …

ఈ కడప రెడ్డెమ్మ మాట అంటే మాటే…!

                          రచన:విజయ మలవతు

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!