ఇష్టం💖
నీ ఎదురుగా నేను లేనప్పుడు
నీవు నా కోసం నీ కనులతో
జల్లెడ పట్టే నీ చూపు నాకిష్టం!!
చిత్రంగా సిత్రంలో నను చూసి నా స్పర్శ ని
ఊపిరిగా మార్చుకొనే నీ మనసంటే నాకిష్టం!!
నను మరిపించి, నిను మెరిపించే
నీ మేని ఛాయా మెరుపులు నాకిష్టం!!
నిశీధిలోని నీటి అలజడిలా మధురంగా వినిపించే
నీ స్వరం అంటే నాకిష్టం!!
బాపు బొమ్మలో ఉండే ఓంపుసొంపుల నిగారింపులా
జాణతనం అంటే నాకిష్టం!!
ఇన్ని వసంతాల ప్రయాణంలొ ప్రతిరోజు ఒక కొత్త ఉదయాన్ని చూపే
మన బంధం అంటే చాలా చాలా ఇష్టం!!
రచయిత :: దీపు
చాలా బాగుంది దీపు👌👌👌👏🏻👏🏻🌹🌹
Tqu జయ 😍