అమృతమూర్తి నా నాన్న
రచయిత: జి. వి.లక్ష్మి

నా అడుగుకు అర్ధం నీవే
నా ఊపిరి ఆధారం నీవే
నా ఉన్నతికి రూపం నీవే
కూతురైనా కొడుకైన నువ్వేరా తల్లి అన్నావ్
అడుగు తడబడిన వేళ ఆసరా అయ్యావ్
నీ ప్రతి కష్టం నాదే అన్నావ్
నా కంట కన్నీరు పొంగిన వేళ అమృత హస్తం అయ్యి తోడు నిలిచావ్
నా ప్రతి విజయాన్ని నాకంటే ఎక్కువ ఆస్వాదించావ్
నా ప్రతి ఇష్టాన్ని తీర్చడం కోసం కష్టించావ్
నువ్వు అత్తారింటికి వెళితే మేము ఏమైపోవాలి
అంటూ నాకంటే ఎక్కువ దుఃఖించావ్
నా అడుగడుగునా తోడు నిలిచిన నీకు ఎలా కృతజ్ఞత తెలుపను
మరు జన్మంటూ ఉంటే నీకు అమ్మను అవ్వాలని ఉంది
బహుశా అప్పుడు కూడా నీ రుణం తీర్చుకోలేనేమో
నా ఊపిరివై నన్ను నీడలా నడిపించే నాన్నకు అంకితం..!

తండ్రి ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.చాలా బాగా చెప్పారు 👏👏👏
నాన్నను ఎవరు గుర్తించారు. చాలా బాగుంది.
అమ్మ పై చూపించే ప్రేమ కనిపిస్తుంది కానీ నాన్న పై గౌరవం కనిపించదండి.
Thankyou
నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..నైస్ naration…👌
అవును ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోతుందేమో🙏