నువ్వు – నేను

అంశం:: నువ్వు – నేను 

 శీర్షిక:: నువు లేని నేను 
 రచన:: రామ్ ప్రకాష్ 
 నువ్వు లేవు,
 కానీ నాలో బ్రతికే ఉన్నావ్..
 నేను ఉన్నా, 
 కానీ ప్రాణమే లేదు…

           శీర్షిక:: నువ్వు-నేను
              రచన:: జ్యోతిరాణి(జో)
నువ్వు నేను
      కరగని దూరాలం
    ఒకే పయనంలో
              ఎదురుచూసే తీరాలం..

1.శీర్షిక :: సమాజంలో మన బాధ్యత
రచన:: సావిత్రి తోట “జాహ్నవి”
నువ్వు నేను 
మనలాంటి కొందరూ
కలిస్తే  సమాజం
భద్రంగా కాపాడుకుందాం
2.శీర్షిక: మన ఆలోచనలు
నువ్వు నేను
ఒకే తల్లిబిడ్డలం
మన ఆలోచన వేర్వేరు
ఎందుకో. 

                          శీర్షిక::మనం కాలేని ఒక్కరం
                  రచన::హసీనాఇల్లూరి
          1.నువ్వు- నేను
                   మనం అనే బంధానికి
          దూరంగా ఉన్న
 ఒకే ఆత్మ
          2.నువ్వు- నేను
        విధి విడతీసిన
                      ఆత్మీయత ముడి వేసిన
 బంధాలం

శీర్షిక::నువ్వు నేను
రచన::ధన
నువ్వు నాలో 
ఉన్నంత  కాలం….
నేను  నీతో కలసి 
ఉంటా జీవితకాలం..

             శీర్షిక::నువ్వు- నేను
                  రచన::నన్ద త్రినాధరావు
  నువ్వు నేను
   ఇద్దరం కాదు 
       ఒకరిలో ఒకరం!
            ఒకరికోసం ఒకరం!!

శీర్షిక  :: నానీకై 
రచన :: కావ్యశ్రీ 
నువ్వు అనే లోకంలో
నీ రాకకై…
ఎదురుచూస్తున్న…
నేను అనే నీ ప్రాణం

  శీర్షిక: నీతోనే
  రచన :: సిరి
         నువ్వు పున్నమి 
  చంద్రుడైతే…
           నేను… నీ వెన్నెల 
         వెలుగునై ఉంటా!

శీర్షిక :: మనమేనా …?
రచన :: విజయ మలవతు
1.కడలి ఆకాశంలా
   ఎన్నటికి చేరువవని
   నువ్వు నేను
   మనం కాముగా…
2.ఇరు మనసుల 
   కలయికలో
   కొత్తగా జనియించిన
   జంట నువ్వు నేను…

          శీర్షిక  :  ‘మన’మై అలా
                     రచన :: సత్య కామఋషి‘రుద్ర’
 రెండు తనువులు
 ఒకటే మనసుగ..
రెండు బ్రతుకుల
 అన్యోన్య గమనం

శీర్షిక  :: నాలో నీవు 
రచన :: గాయత్రి భవ్య
నువ్వు లేని నేను 
నాకే నేను లేను
నాతోనే నువ్వు
నువ్వైన నేను

                                 శీర్షిక  :: నువ్వు నేను – విజయం
             రచన :: శివరంజని
                 నువ్వు నేను ఒకటేగా 
             మాట బాట ఒకటైతే
      విజయాలన్నీ
మనవేగా

శీర్షిక :: ఇష్టమైన ఓటమి
రచన :: ఇత్నార్క్ (క్రాంతి కుమార్ )
ప్రేమ ఓటమితో
పెద్దలకు విజయాన్ని
అందించిన 
నువ్వు నేను….

                         

        శీర్షిక  :: ప్రతిబింబం
                  రచన :: చంద్రకళ. దీకొండ
         అభేదానికి దర్పణం
అద్వైతానికి
ప్రతిబింబం
       నువ్వునేను…!

 శీర్షిక  :: సవ్వడి
 రచన :: తేలుకుంట్ల సునీత
 నా గుండె చప్పుడు నువ్వు
 నే..నీ..కాలి మువ్వను 
 ఈ రెండు సవ్వల్లే
  నువ్వు నేను…..

     శీర్షిక :: మథనం
                 రచన :: అనురాధ కోవెల
నువ్వు నేను
    మదిలో మనం
    తప్పదు ఇకపై
          అంతరంగ మథనం

శీర్షిక :: నువ్వు నేను
రచన :: పరిమళ కళ్యాణ్
నువ్వు – నేను
విడిగా ఉన్న మనం
రూపాలు వేరైనా
ఊపిరి ఒకటే 

                శీర్షిక :: నువ్వు నేను
      రచన  :: దీప్తి
                   నా నువ్వు నీ నవ్వుగా
           నా చెంత ఉంటే..
              కలత లేని నిదుర 
  నాదవదా

శీర్షిక  :: నువ్వు నేను
రచన :: కొఠారు నాగ సాయి అనూష
నా పెదవుల పై
తెల్లని చిరునవ్వు
నీ మనసుకి…
రంగులు పూస్తుంది

    శీర్షిక  :: ఒకే ఆత్మ
           రచన :: జయకుమారి
నువ్వు- నేను
రెండు దేహాలు
ఒకే ఆత్మ గా
                         ముడిపడిన బంధం మన ప్రేమ

శీర్షిక  :: నువ్వు నేను
రచన :: బోర భారతీదేవి 
షడ్రుచులు
సప్తవర్ణాల పూలు
వసంతానికి 
పలికె స్వాగతం

            శీర్షిక ::  నువ్వు – నేను
                  రచన :: ఉదయగిరి దస్తగిరి
  నాప్రేమ గుడిలో
దేవత నువ్వు
    నీ సేవకై వచ్చిన
    పువ్వును నేను

శీర్షిక :: అన్వేషణ
రచన ::రాధ ఓడూరి
నువ్వు ఒక
ఆకాశం
అంతంలేని అన్వేషణలో
మిగిలాను నేను

                      శీర్షిక:- నేనున్నానా…?
            రచన::కమల’శ్రీ
నాలోని
                    అణువణువూ నువ్వు
                       నీలో పరమాణువంతైనా
               నేనున్నానా…???

శీర్షిక  :: *నువ్వు నేను ప్రేమ*
రచన :: అలేఖ్య రవికాంతి 
నా హృదయం నువ్వు 
నీ ఊపిరి నేను
ప్రేమ చినుకులు
మదిని తడుపుతూ!! 

       శీర్షిక :: కన్నీటి భారం
           రచన ::కుమార్ నాగేంద్ర
 కన్నీళ్లాపుకున్నా
   నువ్వు దూరమైనా
కన్నుల్లో రూపం
      మసకబారుతుందని

 శీర్షిక  :: మాయ
రచన :: చలిమేడా ప్రశాంతి
మనసే ఒక మాయ
నువ్వు వొదిలిన
ప్రేమ వలలో 
నేనొక  పావుని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!