వయసు చిత్రం

వయసు చిత్రం

యాభై ఏళ్ల వయసది
అర్ధ శతాబ్దపు జోరది..

నిన్నటి, రేపటి తరాలకు
అది అనుభవాల వారధి…

సంస్కృతీ సంప్రదాయల
విలువలను భద్రంగా కాపుగాస్తూ
ముందుకు నడిపే పెద్దరికపు పెన్నిధి

బరువెక్కిన బాధ్యతల బరువు
కరుగుతుండగా..కాలం మాటున
కప్పి దాచబడిన ఆశల సుమాలు
మెల్లమెల్లగా వికశించుచుండగా

షష్ఠిపూర్తి నవవసంత సంరంభానికి
ముస్తాబవుతూ…మరో బాల్యావస్థ
మహోత్సవానికి సంసిద్ధమయ్యేటి
జీవిత చక్రపు సువిశ్రాంత తీరమది..

అయిపోయిందని అనుకుంటూ
చప్పబడి చతికిలబడిన తనువును
ఆనందోత్సాహాల అసలైన పండుగ
ఇప్పుడే మళ్ళీమొదలంటూ ఊరిస్తూ
ఉసిగొలిపే ఉబలాటపడే మనసు
అల్లరి మొగ్గలేసే వయసు చిత్రమిది..

చాదస్తాల చిలిపి అలకలు…
చేయూతను ఒప్పుకోని ముదురు
వయసు యవ్వనం..మనసుకంటని
ముసలితనపు ముడతల మడతల
సౌందర్యము..మొక్కవోని మనోస్థైర్యం
ఇదే యాభై ఏళ్ల వయసు మహత్యం

రచయిత::సత్య కామఋషి ‘రుద్ర’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!