మా పెన్నిధి

మా పెన్నిధి

రచయిత: లహరి 


ప్రేమంతా గుండెలోన నింపి బయటికి చిరునవ్వు ప్రదర్శించే ఓ నాన్న…
బాధ అయినా బరువైనా,ఏదైనా ఆనందంగా మోస్తూ ఎంత స్వచ్ఛమైన నవ్వు నాన్న….

కుటుంబం కోసం నిరంతరం శ్రమించేవు నాన్నా…
నీ నవ్వు మాకు కొండంత ధైర్యం …
నీ చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే 
కింద పడబోననే కొండంత  భరోసా..నాన్న.
నువ్వు అలా ఎప్పుడూ నవ్వుతూ ఉంటే 
నాకు ఏ దిగులు లేదు నాన్న.. 

నిరంతరం నా భుజం తడుతూ 
ముందుకు నడిపిస్తున్న చేయూత నీది…
నీ కష్టాన్నినా సుఖంగా మలిచేవు…

ఓడినా,నాపై నా నమ్మకాన్ని కోల్పోనీయవు..
సప్త సముద్రాలు దాటినా నీకు సరిసాటిని
కనుగొనలేను..నీ ప్రేమకు ఏ తీరుగా వెలకట్టలేను .. 

నవ్వులు చిందించే ఓ ప్రేమ,మా నాన్నంటే,
కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగులు పంచే దీపం…
కనిపించేవన్నీనిజాలు కావనీ..
చెప్పేవన్నీ నీతులు కావని నేర్పించావు… 

నిజమే నాన్న,ఈ లోకం చాలా అందమైనది 
నిన్ను చూస్తూ నేను నాలాగా ఉండటం నేర్చుకుంటున్నా….
నాన్న నీ అడుగు జాడలే ఎప్పటికీ నాకు మార్గదర్శకాలు..

You May Also Like

15 thoughts on “మా పెన్నిధి

  1. లహారి గారు మా పెన్నిధి నాన్న గురించి చాల అద్భుతంగా చెప్పారు.

  2. Nice, Lahari!! Every one can match it.
    You have nice flow of thoughts and you beautifully write on paper. Keep going 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!