ప్రియమైన నాన్న 

ప్రియమైన నాన్న 

 

రచయిత:శ్రీదేవి విన్నకోట


నాన్న ఈ పిలుపు ఎంత మధురమైనది
విన్న ప్రతిసారి నాన్న మోములో చిరునవ్వులు చిందిస్తూ 
కనిపించే అమూల్యమైన భావం నాన్న

అనురాగం మమకారం ఆత్మీయత అన్ని
కలగలిపిన ప్రియమైన పిలుపు నాన్న 

తన శ్రమతో తానే తనకంటూ ఏమీ 
లేకుండా కరిగిపోయే మంచు పర్వతం నాన్న

తన ప్రేమనే కొవ్వొత్తిగా చేసి పిల్లల జీవితాల్లో
వెలుగుని నింపే  కాంతి కిరణం నాన్న

అనుక్షణం తన బిడ్డల ఉన్నతికై  తహతహలాడుతూ
తను మాత్రం బీదవాడుగా మిగిలిపోయే అసమర్ధుడు నాన్న

పిల్లల జాగ్రత్త కోసం కోపం నటించినా ..
ప్రేమలో,మనసులో కల్మషం లేని ఉత్తమమైన మనిషి నాన్న

 తన బిడ్డల ఆటపాటల్లో చిరునవ్వుల్లోనే 
వజ్రవైడూర్యాలు పోగేసే అల్పసంతోషి నాన్న

తన శ్రమని ఓపికని సంతోషంగా 
తను కన్నవాళ్ళ కోసం నిత్యం ధార పోసే కర్ణుడు నాన్న

పిల్లల విషయంలో అన్యాయం జరిగితే జ్వలించే
అగ్నిపర్వతమే నాన్న

అమ్మ నిజమైతే నాన్న నమ్మకం. తన ఆశల్ని
కోరికల్నిపణంగా పెట్టి తాను మాత్రం సమిధగా మారుతూ
పిల్లల కోసం కమ్మని కలలు కనే వాడే నాన్న.

పిల్లలు సాధించే విజయాల కోసం తాను
అపజయాల పాలైనా పట్టించుకోని ధీశాలి నాన్న.

త్యాగం అంటే నాన్న. నమ్మకం అంటే నాన్న.
ధైర్యం అంటే నాన్న. ఆలంబన అంటే నాన్న.
అపురూపమైన ప్రేమ బంధం నాన్న.

మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు నాన్ననై పుట్టి 
నీ రుణం తీర్చుకోవాలని ఉంది నాన్న.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!