యవ్వనం వృద్దాప్యం మధ్యలో

యవ్వనం వృద్దాప్యం మధ్యలో

అయిదు పదుల వయసు నాది
అటు ఇటు కాని సొగసు ఇది
అటు… ఇటు… రెండు తరాలకు వారధులం
మది కోరుతుంది విశ్రాంతి
బాధ్యతల బరువు పదపద మంటూ
ముందుకు తోస్తుంది
పెద్దలకు భక్తితో చేస్తాం సేవలు
పిన్నలేమో అర్థం చేసుకోలేక చేయించుకుంటారు సేవలు
పెద్దలకేమో కన్పిస్తాం వయసులో ఉన్నట్లు
పిన్నలకేమో తామే చిన్న వారమైనట్లు
వ్యాయామాలకు సమయం చిక్కదు
అలాగనుకుందామంటే వయసు ఊరుకోదు
సకల రోగాలు దరి చేరే వయస్సిది
అప్రమత్తత లేకుంటే అధోగతి
అతివలకు మరింత గడ్డు కాలం
మెనోపాజ్ చేస్తుంది మాయాజాలం
ఒంట్లో శక్తిని హరిస్తూన్న
బహిరంగంగా చెప్పలేని పెద్ద రోగమిది.
మగవారికేమి తక్కువ కాను
ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు
మరోవైపు ఎదిగి వచ్చిన పిల్లల
చదువులు…పెళ్లిళ్లు… భవిష్యత్తు ప్రణాళికలు
ఆడ… మగ భేదం లేదు…
అప్పటికే అందరిని చుట్టేస్తాయి బి.పి… సుగర్ లు…

రచయిత :: సావిత్రి తోట “జాహ్నవి”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!