విశ్రాంత శిబిరం

విశ్రాంత శిబిరం

అర్ధ శతాబ్దపు మనిషి జీవితం
అలుపెరగక తీరానికై సాగే నావ
అనుభవాల తేరు
తానేమిటో తెలుసు
తనవారెవరో తెలుసు
ఎవరికి ఏమి అవసరమో తెలుసు
ఒక్కొక్క నెరుపు అనుభవాల మెరుపు
జడిపిస్తున్న చర్మపు ముడత
నేర్చుకున్న గుణ పాఠాల మడత
యాభై ఏళ్ళ వయసు
జీవన గమనంలో ఒక మజిలీ మాత్రమే
కాస్త ఆగి సేద తీరే విశ్రాంత శిబిరం
బ్రతుకు చిత్రాన్ని అసంపూర్తిగా వదిలేయక
మనసులోని వెలితిని పూడ్చేందుకై
గుండె తలుపుల్ని తెరిచి అన్వేషించు
నీకేమి కావాలో
మిగిలిన సగాన్ని దోసిట్లో ఒడిసి పట్టి
రాబోయే వృద్ధాప్య బాల్యాన్ని
ఆనందంగా ఆహ్వానించు
ఎందుకంటే వయసు ఒక సంఖ్య మాత్రమే
మనసు మాత్రం నిత్య యవ్వని.!

రచయిత::అనురాధ కోవెల✍️

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!