కరోనా ప్రభావి
ఆన్లైన్ పాఠాలు వినడానికి పిల్లలకే ఆసక్తి లేదంటే
పిల్లిని.. నేనెలా కుదురుగా కూర్చుని వినగలను…?!
వాళ్ళేదో చెప్తూ పోవడమే తప్ప మధ్యలో అర్థం కాకపోతే
“మ్యావ్”మంటూ అర(డగ)వడానికీ వీల్లేదాయె..!
పక్కనే మమ్మల్ని తల తిప్పనీయకుండా
పిల్లల తల్లిదండ్రుల్లా మా యజమానులాయె…!
ఎదురుగా గిన్నెలో పాలు నోరూరిస్తుంటే
ఈ అర్థం కాని పాఠాలేమిట్రా బాబో…?!
హాయిగా బడిలోనైతే…
నాకు మంచి మంచి బొద్దు ఎలుకలు దొరికేవి…!
ఈ లాక్డౌన్ తో నష్టపోయిన వాళ్లలో
కరోనాతో కృంగిపోయిన కోట్లాది జీవుల్లో
నేనూ ఒక పావునయ్యాను…
హూ(….మ్యావ్…మ్యావ్…!!!)
రచన: చంద్రకళ. దీకొండ