లోకాభి రాముడు

లోకాభి రాముడు

 

గురువర్యుని ఆజ్ఞ తోటి
శివధనువు నెక్కు పెట్టి

జనక పుత్రిని చేబట్టి

సీతా వల్లభుడాయె నా రాముడు

తండ్రి మాటను చెవిన పెట్టి

సింహాసనం విడిచిపెట్టి

కారడవుల బాట పట్టి

దశరధ ప్రియ నందనుడాయే నా రాముడు

విల్లంబులు చేత బట్టి

లంకకు వారధి కట్టి

రావణుని ఆయువు పట్టి

ధర్మ పాలన స్థాపించెను నా లోకాభి రాముడు

    రచన:: మౌనవీణ

You May Also Like

4 thoughts on “లోకాభి రాముడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!