ముద్దుగా.. బొద్దుగా
బొద్దుగా ఉన్నానని
ముద్దుగుమ్మలందరూ
హద్దులు మరచిపోయి
ముద్దులతో కప్పేశారు,
చల్లని పెదాలకు రంగులద్ది
దిష్టి చుక్కలు పెట్టేశారు,
బోసి నవ్వులతో మురిసిపోతున్న నాకు
ముచ్చెమటలు పట్టించి ముద్దులలో ముంచేశారు,
అర్జున్ రెడ్డికి పోటీ అనుకున్నారో ఏమో,
అందినదే అవకాశంగా అందాన్ని దోచేశారు.
రచన:అనురామ్
Ha ha ha bagundhi saradaga