కొత్త ఆశ
జీవితంలో జరిగిన
చేదు అనుభవాలను
ఈరోజు బయటకు నెట్టి..
అవి మరల తిరిగి రాకుండా
ఆనందాలను అడ్డుగా పెట్టి..
చిరునవ్వుల దీపాలను
నట్టింట వెలిగించి..
పాతను మూలకు నెట్టి
కొత్త బట్టలు ధరించి
నిన్నటిని తుడిచి..
తియ్యని పిండివంటలు ఆరగిస్తూ
ఆరు రుచుల ఉగాది పచ్చడి సేవిస్తూ..
జగతి అంతా హాయిని ఆస్వాదించడానికి కావాలి ఈ పండుగ కొత్త మార్పును తేవాలి..
జీవన సంద్రంలో
ఆటుపోట్ల
సర్వసాధారణం..
కష్టం- నష్టం ఏదైనా ఉంటే అవి నిన్నటికే పరిమితం..
కొత్త వత్సరం కొత్త చిగుళ్లతో
కొత్త ఆశను నెరవేరాలని
చిరు ఆశ..
రచన: వై. మంజులత