నీ అభిమాని నేను.. శివయ్య

రచన – శ్రీకాంత్

శివయ్యా… నీవంటే భక్తి కన్న భయమెక్కువ ఉందయ్యా
ఇంకెన్నాళ్ళు.. నీపై మాకీ భయము చెప్పవా
నాలాంటి పోరగాళ్ళకు… నీవే ఆరాధ్యమయ్య
ఆడంబరము లేకుండా అందరికి నచ్చినోడివి
చిలిపితనము లేకుండా ఇద్దరినీ వలచినావు
స్మశానంలో సంచరించే.. కైలాస నాథుడివి
గరళాన్ని స్వీకరించిన నిస్వార్థపు దైవానివి
ఓం నమః శివాయ నీవే నేననుకుంటూ
నీ తీరు గుణముతో.. జీవించగ తలచితిని

శివయ్యా… నీవంటే… భయమసలే లేదయ్యా
భక్తి పేరుతో… నిన్ను ఇబ్బందే పెట్టను
నీ గుణగణాలు నచ్చి నీకు అభిమానిగా మారిన
నీ నిస్వార్థపు జీవితాన్ని ఆదర్శముగా.. చదివిన
ఆడంబరాలు లేని నువ్వు.. కైలాస ప్రభువని
అహంకార ధోరణిని అణచివేసే రుద్రుడా…
కాలుడివై కనికట్టుతో.. మనిషిని అదుపు చేస్తవే
జీవన పరమార్థానికి నీ రూపమే సాక్ష్యమే
రూపానికి ఆనవాలు లింగమై వెలిసి నువ్వు
కాయంపై వ్యామోహం అవసరమే లేదంటివి
ఓం నమః శివాయ నీ అభిమానిని నేనయ్య.

You May Also Like

One thought on “నీ అభిమాని నేను.. శివయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!