“ప్రకృతి – స్త్రీరూపమే”
ఉషోదయపు వెలుగు రేఖల్లాంటి
ముగ్ధ మోహన రూపసి నీవు
నీరవాన్ని పారద్రోలే కౌముదివి…!!!
కారుమబ్బుల్లాంటి ఒత్తైన జడతో
చూపరుల గుండెల్లో గుబులు రేపి
కలహంసలాంటి నీ నటకతో
మగని మదిలో వేయి వీణలు మ్రోగిస్తూ
ప్రణవ నాదం వాయిస్తోంది…!!!
ప్రేమవర్షం కురిపించే ఆ కళ్లు
పురుష పుంగవున్ని
ఊహల లోకంలో విహరించేలా చేసి
ఆశల పల్లకీలో తిరిగేలా చేస్తాయి..!!!
జలజలపారే జలపాతమై
నగములాంటి మగని మక్కువ తీర్చి
అతని మేనంతా తమకంగా తడిముతూ
వాని తాపాన్ని
వలపు కౌగిలింతతో చల్లారుస్తోంది…!!!
రచయిత :: కమల’శ్రీ’