స్త్రీ నే ప్రకృతి
ఆకాశమే అందగా నవ్వితే
అది మగువ చిరునవ్వే కదా
తన జాలువారే కురుల అందమే
నిశీధి లో మెరిసే చీకటి సోయగం దీవిని లాలించే అమ్మమేగా స్త్రీమూర్తి
తన కన్నీటి జలమే కదా
మన దాహాన్ని తీర్చే నది
తానే కదా ప్రవహించే నిరంతరవాహిని
మగువా మనసే ఎంతో లాలన..
మల్లె మొగలిరేకులా వికసించే తన చూపులు
గాయపడిన తన మాది పడే వేదన
ఈ ప్రకృతి చేసే విలాయతాండవామే కదా
అన్ని తానై ఆదరించే మగువా
జీవితమే అలుపెరుగనీ పోరాటం
తానే కదా ఈ సృష్టినీ నడిపించే శక్తి
ప్రకృతి కి ప్రాణం పొసే వాయువు స్త్రీనే…
రచయిత :: జై ప్రశాంతి