ఉగాది – జీవితం
ఉగాది నవయుగానికి పునాది
బ్రహ్మదేవుని సృష్టి మెుదలైన రోజిది
తీపి… పులుపు… కారం…
ఉప్పు…కారం… వగరు
జీవితంలో వచ్చే అనుభవాల సారమిది
కష్టం వెనక సుఖం…
బాధ వెనక సంతోషాలకు గురుతు ఇది
ఒక చేదు అనుభవం తెలియజేయును..
ఒక జీవితపాఠం
ఒక చేదు గుళిక కరిగించును
శరీరంలోని అనారోగ్యం
చేదును విడిచి..
జీవించలేవు ఏన్నడు.
అదే ఉగాది తెలియచేసే జీవిత సత్యం.
రచన: సావిత్రి తోట “జాహ్నవి”