ఆహ్వాన పండగ ఉగాది

ఆహ్వాన పండగ ఉగాది


కుహు కుహుమని మధురంగా పలికే కోయిల గానం..
పచ్చని చిగురు పురుడు పోసుకొని..మనసుకి ఆహ్లాదాన్నీ కలిపించి మైమరిపించె ప్రకృతి..మామిడి తోరణాలతో పచ్చని చీర కట్టుకున్న తెలుగింటి సాంప్రదాయమే ఈ “ఉగాది “.
మనకి నామకరణం చేసుకునేది ఒక పండగ అయితే,అదే పండగకు నామకరణం చేసె పండగ ఏదైన ఉంది అంటె అది ఒక “ఉగాది” మాత్రమే.. 
ప్రతి సంవత్సరం ఒక నూతన పేరును నామకరణం చేసుకుంటుంది ఈ “ఉగాది”.
సంవత్సర వత్సరానికి నామకరణం చేసుకున్నట్టే ఈసారి కూడ “ప్లవ” అనే  పేరును నామకరణం చేసుకోని “ప్లవ నామ సంవత్సర ఉగాది”గా శ్రీకారం చుట్టింది.
గడిచిన గతాన్ని మరిచిపోయి సరికొత్త జీవితాన్ని నూతనంగా గడపాలని ఆదేశిస్తుంది ఈ “ఉగాది”.
షడ్రుచులతో పరిచయమయ్యే ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కూడ ఇలాంటి షడ్రుచులను కలగలుపుకొలేని జీవితం ఉండదని తెలియజేస్తుంది ఈ “ఉగాది”.
“ఉగాది” అనేది ఒక పండుగనే కాదు.. 
మీరందరూ సరికొత్తగా నూతన రీతిలో..మీ జీవితంలో మార్పు పొందడానికి సదా అవకాశాన్ని కల్పించిన ఆహ్వాన పండగ ఈ “ఉగాది”.

  *******

 ఇకనైన మానవత్వంపై కప్పిన తెర ను తొలగించి..ఈ  నూతన సంవత్సరం నుండి అయిన చెడునీ వదిలి మంచికి ఆహ్వానం పలకండి.. నిజమైన మనుషుల్లా మారండి ప్రజలరా..
అందరికి శ్రీ “ప్లవ నామ సంవత్సర ఉగాది” శుభాకాంక్షలు.

                       రచన: పుల్లూరి సాయిప్రియ

You May Also Like

One thought on “ఆహ్వాన పండగ ఉగాది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!