ప్రకృతి స్త్రీ
ఆకాశం నుంచి జారిపడుతున్న జలపాతాలా అన్నట్లుగా ఉన్న
తన నల్లటి కురులు,
స్వచ్ఛమైన కోనేటి నీరులో మిళమిళలాడే తామరాకు రేణువుల్లా
మెరిసిపోతున్న తన కళ్లు,
నెమలి నాట్యమాడుతుందా అన్నట్టుగా వర్షంలో తడుస్తూ
వాన బిందువులతో తను ఆడుతున్న ఆటలు,
ప్రకృతికి సూర్యుడు వెలుగిచ్చినట్టు
తను నా జీవితంలో నింపిన వెలుగులు,
ప్రపంచంలోని ఏడు వింతలలా తనతో నేను వేసే ఏడు అడుగులు
నా ఏడేడు జన్మలు తోడు రావాలని కోరుకుంటూ…..
వెన్నెల కోసం వేచి చూసే చీకటి
రచయిత :: అనురామ్