ఆమె

ఆమె

ఆమె అంతుచిక్కని అందాల రాక్షసి
ఆమె నయనాలు నాట్యమయూరాలు
ఆమె కురులు అలల తరంగాలు
ఆమె చిరునవ్వులు పున్నమి వెలుగులు

ఆమె నుదుటి సింధూరమే ఉషోదయ సూర్యకిరణాలు

ఆమె మాటలు చిలక పలుకులు
ఆమె కులుకులు కోయిల సరాగాలు

ఆమె మేనిఛాయ మెరుపులే ముత్యాల హరాలు

ఆమె బుగ్గలలోని సిగ్గుల ఎర్రదనమే పగడపు దీవులు

ఆమె చేతి గాజుల గలగలలే జల జల పారే జలపాతాల సవ్వడులు

ఆమె నడుముకి ధరించిన ఆభరణాలే పచ్చని పంటపొలాలు

ఆమె కాలిమువ్వల సవ్వడులే మదిని మురిపించే సంగీత వాద్యాలు

ప్రకృతిలోని అందాలన్నీ నా చెలియకు సింగారాలు

ఆమె ప్రకృతి కాంతకు ప్రతిరూపం
అందుకే ఆమెకు నేను దాసోహం

రచయిత:: ఎస్.నాగమయూరి

You May Also Like

4 thoughts on “ఆమె

  1. అంతు చిక్కని అందాల “ఆమె” బాగుందండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!