అదృష్టం

*అదృష్టం*

అణువణువునా హొయలొలుకుతూ
ఎన్నెన్నో బంధాలతో అల్లుకునే
సుగుణాల సన్నని తీవవు

మబ్బుచాటు చందమామలా
ద్వారబంధానికి బంధీయైనా
బయట జరిగే క్రియలకు కర్తవు

చందనపు పూత పూసిన నగుమోము
పాలరాతి పద్మపు రేకుల చెవులు
శ్వేతవర్ణపు శంఖపు మెడ
అందెల సవ్వడి హంస నడకకి చిరునామా

ఉషోదయపు చల్లగాలికి నీ నల్లని కురులు
ఆకాశాన విహంగ రెక్కల ఈకలై
ఎగిరిపోతుంటే అందుకోలేకున్నా
ఆస్వాదించుటే కదా కర్తవ్యము
అందమైన ప్రకృతే నా ముందు
నాట్యం చేస్తున్నట్లుంది…
ఓ పడతీ…..
ఏమి నా అదృష్టము…!

రచయిత:: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!