శిల్పి

శిల్పి

కరిగిపోయిన జీవితం
వడలిన దేహం
రూపాంతరం చెందవనీ
కాలంతో పాటూ మార్పూ
సహజమంటూ శరీరమార్పులను
ఆనందంగా స్వీకరించేవారు…!!!

బంధాలను అనుబంధాలను
ఒకేతాటిపై ఎలా నడపాలో అని
పిన్నలకు సలహాలను అందించే
జీతం తీసుకోని గురువులు…!!!

తీరని కోరికలను పక్కకు నెట్టి
వయసు అందించిన పెద్దరికంతో
సంసారాన్ని పొందికగా
రూపుదిద్దుకునే శిల్పి…!!!

రెక్కలు వచ్చిన బిడ్డలు
ఎగిరిపోకుండా
బంధాల అనుబంధాల విలువలు
తెలియజేసే ఓ జ్ఞాని…!!!

తన జీవితాన్నే పాఠంగా మలచి
కుటుంబ గ్రంథాన్ని రచించే
ఓ తెలివైన రచయిత…!!!

ద్వేషం అన్నమాటే ఉండదు
ప్రేమించడం తప్ప…!!!

కోపం అన్న ఊసే ఉండదు
సంతోషాన్ని అందివ్వడం తప్ప…!!!

కోరికలంటూ ఏమీ ఉండవు
బిడ్డ లు కోరినవి అందివ్వడం తప్ప…!!!

కుటుంబ సంతోషం తన సంతోషంగా
పిల్లల ఆనందమే తన ఆనందంగా
కాలాన్ని గడిపేయడం తప్ప
ఇంకేమీ అవసరం లేనివాడు…!!!

రచన:: కమల’శ్రీ’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!