విశ్వాసానికి ప్రతీక

విశ్వాసానికి ప్రతీక..


కనకపు సింహాసనమున శునకమ్ముని కూర్చుండబెట్టినా,
గంగ జలంతో పన్నీటి స్నానాలు చేయించినా
మేలిమి పట్టు వస్త్రాలను తెచ్చి కట్టబెట్టినా
సువర్ణ ఆభరణాలతో అలంకరించినా
తీయని పరవాన్నం పెట్టి బుజ్జగించినా
ఎంత మంచి మాటలతో ఎన్ని సుద్ధులు చెప్పినా
ఎన్నినాళ్ళు తోక ఊపుతూ మన చుట్టూ తిరిగినా
శునకము తీరులో మార్పు ఉండనా
వానీ వాలం ఏనాటికైనా తిన్నగా సాగునా
వాటి బౌ బౌ అరుపులో సంగీతం ధ్వనించునా
మనం ముద్దుగా పిలిచే పిలుపులో అవి మన మమకారం గమనించేనా.
అవి నమ్మకానికి విశ్వాసానికి ప్రతీకలు.
ఒంటరిగా ఉన్న వాళ్ళకి తోడు నీడలు.
ఆహారం  ప్రేమ తప్ప ప్రతిఫలం ఆశించని 
అమాయక జీవులు
ప్రాణాలకు తెగించి ఇంటిని రక్షించే నమ్మిన బంటులు
మనకి ఉల్లాసం ఉత్సాహం కలిగించే నేస్తాలు
వాటి ఆట తో మనకు సమయం తెలియకుండా
చేసే అందమైన పట్టుకుచ్చుల మెత్తని ఆటబొమ్మలు.
మనకు ప్రాణం అయిపోయిన అందమైన బంగారు బుజ్జి తల్లులు.
ఎప్పుడు మన చుట్టూ మనమే లోకంగా మెలుగుతూ తిరిగే అందమైన అరుపుల రాక్షసులు.

రచయిత:శ్రీదేవి విన్నకోట

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!