అమ్మో భార్య
వారెవా పురుష పుంగవులే
పోతు పేరంటాలై ముత్తయిదులైన
చూడచక్కని వైనం.
పాపం కరోనా రాకతో
వారు వీరు ఆయిన కథనం.
పసుపు పారాణి, కుంకుమ బొట్టు. సరిగంచు చీర,
గలగల గాజుల మోత,
అలంకారాలు అతి అయి
భలే ముచ్చట గొలుపు రూపం.
నాకు ఇదేమీ ప్రారబ్దం
నా తలరాత ఇలా అఘోరించినది అని
మనసులో అతని చింత
భార్య చేతి ఉడుంపట్టు లో పట్టుబడితే
తప్పించుకొనుట కలలో మాటయే సుమా చెప్పినట్టు వినడం తప్ప
మరో మార్గం లేదని పారిపోవుట సాధ్యం కాని
పని అని తెలుసుకుని మసులుకోవొయ్ ఓ మనిషి.
రచన :: శ్రీదేవి విన్నకోట