వారేవా ఏమి ఫేసూ
వారెవ్వా ఏమి ఫేసు
అచ్చం ముత్తైదువులా ఉంది బాసూ.
వేసెయ్యి చీరా బ్లౌజూ
తొడిగెయ్యి చేతికి గాజూ.
లోకంలో కరోనా హైపూ
నువ్ రాసెయ్యి కాళ్ళకు పసుపూ.
నర్తనశాలలో ఎన్టీఆర్ లా
నువ్వే మీ ఇంటి బృహన్నలా.
కొత్తగా వచ్చిన రూపంతో
నుదుటిన కాసంత సింధూరంతో.
చుట్టుముడుతున్న మహమ్మారి హోరు
మనకెందుకు పెళ్ళాం తో పోరూ.
మారిపో అచ్చమైన పోతు పేరంటంగా
తీసుకో వాయినం వయ్యారంగా.
రచన :: మౌనవీణ