మా నాన్న

మా నాన్న

రచయిత:విజయ మలవతు


ఎలా నీ అంత నిబ్బరంగా ఉండాలో ఇప్పటికి
తెలియదు నాన్న..

కష్ట నష్టాలకు చలించని మనసా నీది..
కన్నిటికి అర్థం తెలియని కన్నులా నీవి..

ఎంత బాధనైనా గుండెల్లో దాచుకునే
రాతి గుండెనా నీది..
గంబీరంగా ఉంటూనే దారి చూపటం
నీకలవాటుగా మారెనా.. 

అంత నిబ్బరం పుట్టుకతో రాలేదని
తెలుసుకున్నాలే…
తండ్రిగా మారిన పిమ్మట వచ్చేనా ఈ వింత
మార్పు…

బిడ్డల భవితకు బంగారు బాటకై చేసే
త్యాగాలన్ని ఎవరి ఖాతాలోకో పంపుతావే…

ఏ దిక్కు లేక ఒంటరిగా నిలిచిన కూతురినే
కొడుకుగా చూసుకునే ధైర్యం ఎలా వచ్చెనో..

అడపిల్లకై ఆలోచించి తట్టుకోలేని మానసిక
అశాంతిని తెచ్చుకొని గుండెనే ఆప
ప్రయత్నించావే అంత ఇష్టమా మేమంటే..

ఇప్పటికి నీ కళ్ళముందు మేము చిన్న పిల్లలమే నా..
ఎప్పటికి పెద్దవాళ్లగా చూస్తావో..

కృష్ణమూర్తి సర్ ‘ అని ముద్దుగా పిలిచినా 
ముసి ముసి నవ్వులేనా మా కానుకలు నాన్న…

You May Also Like

2 thoughts on “మా నాన్న

  1. మూర్తి గారి అమ్మాయి తనుకూడా అధ్యపకురాలు అయింది…నాన్న బాటలోనే నడుస్తూ నాన్న భావజాలాన్ని జగతికి పంచింది….👌👌💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!