ప్రకృతిమాత

ప్రకృతిమాత

పుడమి తల్లి పురి విప్పిన నెమలి
నీవు కనిన కలలు రమ్యం

చిట్ట అడవులు కాలువలు
నదులు కొండలతో విలసిల్లింది

నినుచూసి మురియని జీవిలేదు
నీవ డిలో నిదిరించని జీవి లేదు

ప్రేమగా నీ సంపదలో తినని పండులేదు
విరియని పువ్వులేదు

ఆకాశాన్ని తాకుతున్న వృక్షములు
అందమైన అనుభూతి ఆనందం

భూమాతా మము కాపాడుతున్నావు
భూమాతా మరువలేము నీ సేవ

నరుకుతున్నాం అడవులు
పెంచుతున్నాం కాలుష్యం

పచ్చదనం పెరికివేస్తున్నాం
పరవశించి పోతున్నాం

నీ ఒడి నుండి దూరమవుతున్నాం
నీవులేని జీవమేది నీడ ఏది

రచయిత :: అమృతపూడి రేవతి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!